పవర్ స్టార్ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?

SMTV Desk 2017-12-20 16:40:20  Agnathavasi, pavankalyan, Surprise fans, trivikram,

హైదరాబాద్, డిసెంబర్ 20 : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు ‘అజ్ఞాతవాసి’ చిత్ర బృందం న్యూ ఇయర్ సందర్భంగా ఓ సర్‌ప్రైజ్‌ ను అందిస్తుంది. అదేంటి అనుకుంటున్నారా...పవన్‌కల్యాణ్‌లో మంచి నటుడే కాకుండా ఓ చక్కటి గాయకుడు ఉన్నారు. ఇప్పటికే ఆయన ‘జాని’, ‘అత్తారింటికి దారేది’, ‘కాటమరాయుడు’ చిత్రాలలో పాడిన పాటలకు మంచి స్పందన లభించింది. కాగా, పవన్‌ 25వ సినిమాగా ‘అజ్ఞాతవాసి’ లో కూడా ఆయన ఓ పాట పాడినట్లు ఇటీవల చిత్ర బృందం తెలిపింది. అయితే, ఈ పాటను డిసెంబరు 31న విడుదల చేయబోతున్నట్లు చెప్పింది. అంటే.. నూతన సంవత్సరం పురస్కరించుకొని పవన్‌ అభిమానులకు ఇది ఓ గిఫ్ట్ అన్నమాట. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.