ఎంపీ శ్రీనివాస్‌ రెడ్డి కుటుంబానికి సీఎం పరామర్శ

SMTV Desk 2017-12-20 16:13:02  MP Ponguleti srinivas reddy, cm kcr Visitation, khammam

కల్లూరు, డిసెంబర్ 20 : నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి, ఖమ్మం జిల్లాలోని నారాయణపురం ప్రాంతానికి వెళ్లారు. ఇటీవల అనారోగ్యంతో ఎంపీ శ్రీనివాస్‌ రెడ్డి తండ్రి రాఘవరెడ్డి మృతి చెందారు. దీంతో నేడు కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నారాయణపురం వెళ్లారు. ఈ సందర్భంగా రాఘవరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హోం మంత్రి నాయని నరసింహారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌, తదితరులు సీఎంతో పాటు అక్కడికి వెళ్లారు.