దత్తత గ్రామంలో పర్యటించిన "మాస్టర్ బ్లాస్టర్"

SMTV Desk 2017-12-20 15:47:44  sachin tendulkhar, village tour, donja.

డోంజా, డిసెంబర్ 20 : క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టె౦డుల్కర్‌ దత్తత తీసుకున్న గ్రామంలో పర్యటించారు. గతంలో ఆయన సంసద్ ఆదర్శ్‌ గ్రామ యోజన(ఎస్‌ఏజీవై) పథకం కింద మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లాలోని డోంజా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తాజాగా ఆ గ్రామాభివృద్ది పరిశీలన నిమిత్తం సచిన్‌ అక్కడకు వెళ్లారు. ఈ మేరకు గ్రామస్తుల నుండి ఆయనకు ఘన స్వాగతం లభించింది. సచిన్.. అక్కడి పాఠశాల భవనం, కాంక్రీట్‌ రోడ్లు, మంచినీరు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ ఆర్‌వీ గమేతో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కాగా డోంజా గ్రామంలో పర్యటన విషయాలను సచిన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "డోంజా పర్యటన చాలా సంతృప్తినిచ్చింది. ఆ గ్రామ ప్రజలకిచ్చిన మాట నెరవేరబోతుందన్న నమ్మకం కలిగింది. ఇలాంటి పథకాల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేయడం అభినందనీయం" అంటూ ట్వీట్ చేశారు.