ముస్లింల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు

SMTV Desk 2017-06-17 17:13:49  TRS Government, Welfare schemes, State Forest and BC Welfare Minister Jogu Ramanna, adhilabad

ఆదిలాబాద్, జూన్ 17 : తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో 3 వేల మంది ముస్లిం మహిళలకు గిఫ్ట్‌ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసి మెలిసి సోదరభావంతో జరుపుకోవాలని అన్నారు. గత పాలకుల హయాంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. మైనార్టీలకు షాదీముబారక్‌ కింద రూ.75 వేలు అందించటంతో పాటు మైనార్టీ గురుకులాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. జేసీ కృష్ణారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజన్న, మైనార్టీ నాయకులు సిరాజ్‌ఖాద్రి, సాజిదొద్దీన్, యూనుస్‌అక్బానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదన్నారు.