బారాబతి స్టేడియంను పరిశీలించిన ధోని...

SMTV Desk 2017-12-20 13:10:31  T20 Match, dhoni check pich, india, srilanka, bhuvaneshvar, katak.

కటక్, డిసెంబర్ 20 : భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ.. మ్యాచ్ ఎక్కడ జరుగుతున్నా.. మొదట ఆ పిచ్ ను పరిశీలిస్తూ ఉంటాడు. ఈ రోజు భారత్ కు, శ్రీలంకతో కటక్ లోని బారాబతి స్టేడియంలో తొలి టీ-20 జరగనున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ మైదానంలో 2015 దక్షిణాఫ్రికాతో జరిగిన టీ-20 మ్యాచ్ లో భారత్ 92 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌ జరిగి చాలా కాలమైన నేపథ్యంలో ధోనీ ఈ పిచ్ ను పరిశీలించారు. అనంతరం యువ ఆటగాళ్లకు పలు సూచనలు చేశారు. గతంలో కూడా ఇదే మాదిరి రాంచీలో టీమిండియా టెస్టు ఆడే ముందు పిచ్ ను పరిశీలించిన ధోనీ.. మిగతా ఆటగాళ్ళకు పలు సలహాలు ఇచ్చారు.