ఐపీఎల్ సీజన్ 11.. వేలం తేదీలు ఖరారు...

SMTV Desk 2017-12-20 12:30:36  IPL, AUCTION, 11TH SEASON, BANGALORE.

బెంగళూరు, డిసెంబర్ 20 : ప్రపంచ క్రికెట్ చరిత్ర రూపు రేఖలను పూర్తిగా మార్చేసిన టోర్నీ ఐపీఎల్(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్). ఈ లీగ్ పది సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకొని 11 వ వసంతంలోకి అడుగుపెడుతోంది. కాగా ఈ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వేలం ప్రక్రియ తేదీలు ఖరారయ్యాయి. 2018 జనవరి 27, 28 తేదీల్లో ఈ వేలం నిర్వహించనున్నట్లు స్వయంగా బీసీసీఐ అధికారులు ధ్రువీకరించారు. గతంలో ఆటగాళ్ల కోసం రూ.66 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీలు ఈ సారి రూ. 80 కోట్ల వ‌ర‌కు వెచ్చించే అవకాశం బోర్డు కల్పించింది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన రీటెన్షన్ పద్ధతి ద్వారా రెండు విధానాలలో 5 గురు ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీలు దక్కించుకునే అవకాశముంది.