రాజకీయల్లోకి ..రజనీ...!

SMTV Desk 2017-06-17 16:25:57  Tamil superstar Rajinikanth, December 12, party

చెన్నై, జూన్ 17 : తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఈ ఏడాది చివర్లో రాజకీయ అరంగేట్రం ఖరారు చేయనున్నట్లు, పార్టీ ఏర్పాటుకు ఆయన సిద్దంగా ఉన్నట్లు సమాచారం. కోలీవుడ్‌లోని విశ్వసనీయ వర్గాలు చెప్పే ప్రకారం రజనీకాంత్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఆయన జన్మదినమైన డిసెంబరు 12న కొత్త పార్టీ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇప్పటికే చిన్నాచితకా తమిళ పార్టీలు రజనీకాంత్ రాజకీయ అరంగేట్రాన్ని వ్యతిరేకిస్తుండగా, పెద్ద పార్టీలు మాత్రం ఆయన రాకను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇటీవల రజనీ తన అభిమానులతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఆ సమయంలో ‘యుద్ధం వచ్చినప్పుడు చూద్దాం. సిద్ధంగా ఉండండి’ అంటూ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేపటంతో ఆయన రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవ్వడం వల్లనే అలాంటి ప్రకటన చేశారని పలు వర్గాలు విశ్లేషించాయి. బీజేపీ అయితే తమ పార్టీలో చేరాలంటూ బహిరంగంగానే పిలుపునిచ్చారు. అంతేగాక ఆ పార్టీకి చెందిన నేతలు సైతం రజనీని కలిసి మాట్లాడారు. తన జన్మదినమైన డిసెంబర్ 12నాడు పార్టీ ప్రారంభించేందుకు రజనీ సన్నాహాలు చేసుకుంటున్నారని ఆయన సన్నిహిత మిత్రుడు శుక్రవారం రోజున మీడియాకు తెలిపారు. ఇప్పటికే ఆయన కొంతమంది ప్రముఖులతోనూ చర్చించారన్న సమాచారం.