బెన్‌ స్టోక్స్‌ లేకపోవడం వల్లె ఓడిపోయాం : గ్రేమ్‌ స్వాన్‌

SMTV Desk 2017-12-19 18:54:34  BEN STOKES, ASHES, GRAME SWAN, ENGLAND

పెర్త్, డిసెంబర్ 19‌: యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాజయం చవి చూసిన సంగతి తెలిసిందే. మరో రెండో మ్యాచ్ లు ఉన్న అవి పరువు కోసం పోరాడవలసినవి. అయితే ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణం ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ లేకపోవడమని ఆ దేశ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... "స్టోక్స్‌ లేకపోవడంతో మా జట్టు ఓడిపోయింది. ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు ఉండగానే యాషెస్‌ను కోల్పోవడానికి కారణం ప్రధాన ఆటగాళ్లు జో రూట్‌, అలెస్టర్‌ కుక్‌లు విఫలం కావడమే. మా జట్టులో డేవిడ్‌ మాలన్‌ ఆట తీరు మినహా చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. జట్టులో స్టోక్స్‌ లేకపోవడం వల్ల తొలి మూడు గేమ్‌ల్లోనే సిరీస్‌ను కోల్పోతుందనే విషయాన్ని ముందే అంచనా వేశాను. అదే జరిగింది" అని తెలిపారు.