యూటర్న్ తీసుకున్న భాజపా ఎంపీ..!

SMTV Desk 2017-12-19 16:25:29  bjp MP sanjay kakade, comments on modi, gujarath elections.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19 : నేను జీరోని అంటూ మోదీని తెగ పొగిడేస్తున్నాడు భాజపా ఎంపీ సంజయ్‌ కకడే. ఇటీవల జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మెజారిటీని సాధించలేద౦టూ విమర్శించిన ఆయన ప్రస్తుతం మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మోదీకి ఉన్న సత్తా గురించి ఆలోచించకుండా మాట్లాడాను. మోదీకి ఉన్న జనాకర్షణనే ఆయనను ఎన్నికల్లో గెలిపించింది. నిజంగా మోదీ ఒక హీరో. నేను ఓ జీరో" అంటూ పేర్కొన్నారు.