హిమాచల్‌ సీఎం వీరభ్రదసింగ్‌ రాజీనామా..!

SMTV Desk 2017-12-19 16:13:25  veerabadhra sigh, resign, cm, himachalpradesh

సిమ్లా, డిసెంబర్ 19 : హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం వెలువడిన హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజీనామా పత్రాలను గవర్నర్‌ ఆచార్య దేవ్‌రత్‌కు అందజేశారు. కాగా వీరభ్రదసింగ్‌ రాజీనామాకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాలను కొత్త మంత్రులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా గవర్నర్‌ వీరభద్ర సింగ్‌కు సూచించారు. 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్‌లో భాజపా 44 స్థానాలను గెలుచుకుంది. కానీ.. భాజపా సీఎం అభ్యర్థిగా నిలబడిన ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ మాత్రం ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి పేరును పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వెల్లడించారు. సీఎం అభ్యర్థి రేసులో కేంద్రమంత్రి జేపీ నడ్డా, భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జైరామ్‌ ఠాకుర్‌, సురేష్‌ భరద్వాజ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.