పీటర్సన్‌ పై భగ్గుమన్న నెటిజన్లు.!

SMTV Desk 2017-12-19 14:12:42  Kevin Pietersen, England cricket team, ashes series.

పెర్త్, డిసెంబర్ 19 : ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ జో రూట్‌పై ఆ దేశ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ వ్యంగ్యాస్తాలు సంధించారు. అసలే యాషెస్‌ సిరీస్‌ కోల్పోయి తీవ్ర దిగ్బ్రాంతిలో ఉన్న ఆ జట్టుపై కెవిన్ విమర్శలు చేయడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాసిస్ సిరీస్‌కు కామెంటేటర్‌గా ఉన్న పీటర్సన్‌.. తన ట్విట్టర్ ఖాతాలో.. ఈ ఓటమికి కెప్టెన్‌ జో రూట్‌ను బాధ్యుడిని చేస్తూ ఓ మార్ఫింగ్‌ ఫొటోను పోస్ట్‌ చేశాడు. అలాగే జో రూట్‌ వాటర్‌ గన్‌ను పట్టుకున్నట్లుగా మార్ఫింగ్‌ చేసిన ఓ ఫొటోను, ఆ ఫోటో కింద అద్భుతమైన కెప్టెన్‌ అంటూ క్యాప్షన్‌ పెడుతూ పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. "పీటర్సన్, ఓసారి నీ మొహం అద్దంలో చూసుకో. నువ్వెప్పుడు ఆసీస్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురికాలేదా.? నీ వ్యక్తిగత ప్రదర్శనతో ఎప్పుడూ ఇంగ్లండ్‌ జట్టును గెలిపించలేదన్న సంగతి గుర్తుంచుకో" అని ఓ అభిమాని ట్వీట్‌ చేయగా, మరో అభిమాని.. "నా పాకెట్‌లో కూడా పిస్టల్‌ ఉంది. దాన్ని నీపై గురిపెడతా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.