ఇప్పుడు కోహ్లీని అనుకరిస్తున్నా : బాబర్‌ అజామ్‌

SMTV Desk 2017-12-19 14:09:17  KOHLI, BABAR AZAM, PAKISTAN, INDIA CAPTAIN

పాకిస్తాన్, డిసెంబర్ 19 : ప్రపంచ అగ్రగామి బ్యాట్స్ మెన్ గా ఎన్నో రికార్డులను తన పాదాక్రాంతా౦ చేసుకుంటూ రన్ మెషీన్ గా పేరొందిన క్రికెటర్ కోహ్లీ.. భారత్ క్రికెట్ జట్టు సారధిగా కూడా తనదైన శైలిలో జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. అలాగే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎవరైనా క్రీడాకారుడు గొప్ప ప్రదర్శన చేస్తే చాలు వాళ్లను దిగ్గజ ఆటగాళ్లతో పోల్చేస్తూ ఉంటాం. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెటర్ బాబర్‌ అజామ్‌ను చాలా మంది కోహ్లీతో పోలుస్తున్నారు. ఈ విషయంపై అజామ్‌ స్పందిస్తూ.. " సాధారణంగా నేను దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఆటను ఇష్టంగా చూసే వాడిని. కానీ ఇప్పుడు కోహ్లీ, ఆమ్లాతో పాటు డివిలియర్స్‌ను కూడా అనుకరిస్తున్నాను. మా కోచ్ ఆర్ధర్‌ నన్ను విరాట్ తో పోల్చారు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. కానీ ప్రపంచంలోనే కోహ్లీ నంబర్‌వన్‌ బ్యాట్స్‌మెన్‌" అని తెలిపారు. ఇప్పటి వరకు 36 వన్డేలు ఆడిన అజామ్‌.. 58.60 సగటుతో 1,758 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు శతకాలు, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. ప్రస్తుతం బాబర్ అజామ్‌ ఐసీసీ అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో 846 పాయింట్లతో4 వ స్థానంలో కొనసాగుతున్నాడు.