ఆ భావాన్ని మాటల్లో వర్ణించలేను : స్మిత్

SMTV Desk 2017-12-19 13:32:31  ashes series, smith, australia captain, perth

పెర్త్, డిసెంబర్ 19 : యాషెస్ సిరీస్ అంటే ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్ మధ్య భీకరమైన పోరును తలపిస్తుంది. అలాంటి ఈ సిరీస్ లో మరో రెండు మ్యాచ్ లు మిగిలుండగానే 3-0 తో సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఈ విషయంపై ఆసీస్ కెప్టెన్ స్మిత్ మాట్లాడుతూ... "యాషెస్‌ సిరీస్‌కు నాయకుడిగా బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. మరో రెండో మ్యాచ్ లు మిగిలుండగానే సిరీస్ మా వశం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆదివారం జరిగిన మూడో టెస్ట్ విజయం తరువాత సంతోషంతో ఏడ్చేశాను. ఆ భావాన్ని మాటల్లో వర్ణించలేను. తొలిసారి యాషెస్ లాంటి మహా సమరంలో నా మార్క్‌ ఏమిటో చూపించాను" అని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్టులో స్మిత్ ద్విశతకం సాధించి ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ గా ఎంపికైన విషయం తెలిసిందే. కాగా ఆసీస్- బ్రిటిష్ జట్ల మధ్య 4 వ టెస్ట్ ఈ నెల 26న సిడ్నీలో జరగనుంది.