తిరుపతి పవిత్రతను రక్షించే నాధులే లేరా?

SMTV Desk 2017-06-17 15:25:00  Andhra Pradesh,Chitoor,Tirupati,Sri Venkateshwara Temple,security

తిరుపతి, జూన్ 17 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి. అలాంటి ప్రదేశం లో సెక్యూరిటీ లోపాల కారణంగా తిరుమల కొండపై అపచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. భద్రతా లోపాలను ఉపయోగించుకుని కొంతమంది పవిత్రమైన స్థలంలో నీచమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వెంకన్న సన్నిధికి మద్యం, సిగరెట్లు, గుట్కాల సరఫరా ఇష్టానుసారంగా సాగుతోంది. తాజాగా భవన నిర్మాణ కూలీల నుంచి ఏకంగా 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగులు కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల కొండపై ఇలాంటి దారుణాలు జరుగుతుండటం ఏమిటని భక్తులు వాపోతున్నారు.