అంతర్జాతీయ ఆటకు కాకా బై.. బై...

SMTV Desk 2017-12-19 11:19:23  Brazilian football star, Christian kaka, announced retirement,

రియో డి జనిరో, డిసెంబర్ 19 : బ్రెజిల్‌ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్ లకు ప్రాతినిథ్యం వహించి.. 29 గోల్స్‌ సాధించిన బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియన్‌ కాకా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ ఆట నుండి బయటికి వచ్చినప్పటికీ సాకర్‌తో అనుబంధం కొనసాగిస్తానని వెల్లడించారు. అంతేకాకుండా 2003 లో బెస్ట్ పుట్ బాలర్ లకు అందించే "బాలన్ డి ఓర్ అవార్డు"ను గెలుచుకున్నాడు. రిటైర్మెంట్‌ అనంతరం కాకా ఏసీ మిలన్‌ జట్టుకు మేనేజర్‌ లేదా స్పోర్టింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.