రహానె నాణ్యమైన ఆటగాడు : దాదా

SMTV Desk 2017-12-19 10:44:05  Team india former captain, Sourav Ganguly, comments on Rahane.

పూణె, డిసెంబర్ 19 : అజింక్య రహానె... భారత్ క్రికెట్ జట్టులో ఓ అగ్ర శ్రేణి ఆటగాడిగా పేరొందిన ఈ మేటి బ్యాట్స్ మెన్, సూపర్ టెక్నిక్ తో అద్భుతాలు సృష్టించగలడు. అయితే ప్రస్తుత రహానే ఫాం టీమిండియా జట్టును కలవరపరుస్తుంది. ఈ విషయంపై భారత్ మాజీ కెప్టెన్ గంగూలీ స్పందిస్తూ.. "రహానె ఫామ్‌పై ఆందోళన అవసరం లేదు. అతను నాణ్యమైన ఆటగాడు. విరాట్‌ కోహ్లి, రహానె, ఛెతేశ్వర్‌ పుజారా, మురళీ విజయ్‌ మెరుగైన క్రికెటర్లుగా దక్షిణాఫ్రికాలో మళ్లీ అడుగు పెట్టబోతున్నారు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్‌ బాగుంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను ఏ స్థానంలో ఆడించాలో జట్టు నిర్ణయించుకోవాలి. టీమిండియా అద్భుతమైన జట్టే. ఫలితం గురించి ఇప్పుడే చెప్పడం మాత్రం కష్టం" అని వ్యాఖ్యానించారు.