మమ్మల్ని వారితో పోల్చకండి : చాహల్

SMTV Desk 2017-12-18 18:15:32  India spinners, chahal, kuldeep, india cricket team players.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18 : విశాఖ వేదికగా ఇటీవల భారత్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ 2-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్ లో లంక బ్యాట్స్ మెన్ లు తొలుత భారత్ ను ధాటిగా ఎదుర్కొన్నప్పటికీ, భారత్ స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌ కోలుకోలేని దెబ్బ తీశారు. వీరిద్దరూ చెరో మూడు వికెట్లు సాధించి లంకను తక్కువ పరుగులకే పరిమితం చేసి భారత్ విజయ౦లో కీలక పాత్ర పోషించారు. కాగా వీరిద్దరు అశ్విన్, జడేజా స్థానాలను భర్తీ చేశారని చాలా మంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమను వారితో పోల్చడంపై చాహల్ స్పందిస్తూ.. " గత ఐదారేళ్లుగా అశ్విన్, జడేజాలు జట్టు కోసం ఎంతో కృషి చేశారు. అలాంటి వారితో తమను పోల్చడం సరికాదు. మేము నాలుగైదేళ్ల నుండే ఆడుతున్నా౦, కాబట్టి వారితో నన్ను, కుల్దీప్‌‌ను పోల్చవద్దు" అంటూ కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు.