రామ్ చరణ్ సినిమాలో విలన్ గా వివేక్ ఒబ్రాయ్

SMTV Desk 2017-12-18 17:31:22  ram charan, vivek obroi, boyapati srinu movie.

హైదరాబాద్, డిసెంబర్ 18: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం1985’ సినిమా తో బిజిగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చరణ్ దీని తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కారెక్టర్ పవర్ పుల్ గా ఉండడంతో, విలన్ పాత్రకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. దీనికోసం బోయపాటి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబ్రాయ్ సంప్రదించినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో టాక్. ఇప్పటి వరకు చాలా సినిమాలలో వివేక్ ప్రతి నాయకుడి పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.