బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ కలకలం

SMTV Desk 2017-12-18 16:18:52  Blade batch, murder, vijayawada krishna dist

విజయవాడ, డిసెంబర్ 18 : గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడ్ తో ఇద్దరిపై దాడికి పాల్పడిన ఘటన విజయవాడ జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు రోడు మీదుగా నడుచుకుంటూ వెళుతుంటే బ్లేడ్ బ్యాచ్ వచ్చి దాడి చేసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు బ్లేడ్ బ్యాచ్ గురించి నాలుగు బృందాలుగా గాలిస్తున్నారు.