ఈవీఎంల ట్యాపరింగ్ జరిగింది : హార్దిక్ పటేల్

SMTV Desk 2017-12-18 16:01:59  patidar head, hardik patel, gujarath, evm tampering

గుజరాత్, డిసెంబర్ 18 : గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజెపీ వరుసగా ఆరోసారి అధికార పీఠo దక్కించుకొంది. కాగా ఈ విజయంపై పాటిదార్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఈవీఎంల పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "సూరత్, రాజ్ కోట్, అహ్మదాబాద్ లో ఈవీఎం లను ట్యాపరింగ్ చేసి బీజేపీ విజయం సాధించింది. సాంకేతిక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈవీఎంలు వాడడం లేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్న బీజేపీ పై మా పోరాటం కొనసాగుతుంది. నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. బీజేపీ విజయానికి నా శుభాకాంక్షలు" అంటూ వ్యాఖ్యానించారు.