బెజవాడలో కలకలం రేపిన మరో హత్య

SMTV Desk 2017-12-18 15:47:47  vijayawada, Noodles merchant chanda Venkateshwara, murder

విజయవాడ, డిసెంబర్ 18 : బెజవాడలో దారుణాలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితం జరిగిన రౌడీ షీటర్ దారుణ హత్య మరువక ముందే, మరోకరు హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సింగ్‌ నగర్‌ ముత్యాలమ్మ కాలనీలో నూడిల్స్‌ వ్యాపారి చందా వెంకటేశ్వరాజు అనే వ్యక్తి, అర్ధరాత్రైనా ఆయన షాపు నుంచి ఇంటికి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబీకులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వెతికారు. అయితే, ఉదయం కల్లా నడిరోడ్డుపై విగతజీవిగా పడిఉన్న వ్యాపారిని చూసిన కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అర్థరాత్రి వ్యాపారిని హత్య చేసి దుండగులు రోడ్డుపై పడేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటసనాస్థలికి చేరుకున్న పోలీసులు, మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.