‘ఎంసీఏ’ ఫ్యామిలీ పాట ట్రైలర్‌ను చూశారా...

SMTV Desk 2017-12-18 13:18:49  MCA Movie, nani, saipallavi, family song Trailer

హైదరాబాద్, డిసెంబర్ 18 : నాని, సాయిపల్లవి నటించిన ‘ఎంసీఏ’ క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఇప్పటికే చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. కాగా, ఆదివారం సాయంత్రం ఈ చిత్రంలో ‘ఫ్యామిలీ పార్టీ..’ అని సాగే పాట ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో నాని, సాయిపల్లవి చాలా హుషారుగా డ్యాన్స్‌ చేశారు. నాని అన్నయ్య రాజీవ్‌ కనకాల, భూమికల పెళ్లి వేడుకను నిర్వహించినట్లు ఈ పాటలో తెలుస్తోంది. ఇందులో భాగంగా అందరూ కలిసి స్టెప్పులేశారు. ఈ సినిమా షూటింగ్‌ మొత్తం వరంగల్‌లోనే జరిగింది. శనివారం సాయంత్రం వరంగల్‌ లో సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.