ఆరాధ్య డాన్స్ కు ఐష్‌, అభి ఫిదా

SMTV Desk 2017-12-18 12:57:27  abhishek, ishwaryarai, aradhya, school annual day, mumbai

ముంబయి, డిసెంబర్ 18 : అభిషేక్‌-ఐష్‌ల కుమారై ఆరాధ్య బచ్చన్‌ ఎక్కడికివెళ్లినా ఐష్‌ కంటే ముందే చక్కగా ఫొటోలకు పోజిలిస్తుంది. తాజాగా ఆరాధ్య చదువుతున్న ధీరూబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో ఆరాధ్య తోటి విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ చేసింది. దీనికి విచ్చేసిన ఐశ్వర్య, అభిషేక్ లు గారాల పట్టి ఆరాధ్య చేసిన డాన్స్ చూసి మురిసిపోయారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి జయా బచ్చన్‌తో పాటు షారుక్‌ ఖాన్‌, కరిష్మా కపూర్‌ తదితరులు హాజరయ్యారు. షారుక్‌ కుమారుడు అబ్రామ్‌ ఖాన్‌, కరిష్మా కపూర్‌ పిల్లలు సమైరా, కియాన్‌లు కూడా ఇదే పాఠశాలలో చదువుతున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను షారుక్‌ ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆరాధ్య డ్యాన్స్‌కి మాత్రం ఐష్‌, అభినే కాదు నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారట.