గూగుల్ హెచ్చరిక.. ఇక అలాంటి వార్తలు చెల్లవు...

SMTV Desk 2017-12-18 12:32:52  GOOGLE, fake news, websites, google warns to fake websites.

న్యూయార్క్, డిసెంబర్ 18 : ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ అసత్య వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలను చేపట్టింది. ఇటీవల కాలంలో నెటిజన్లను తప్పుదోవ పట్టించే నిమిత్తం అసత్య వార్తలు అనేకంగా పెరిగిపోతున్నాయి. అలాంటి వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఫేక్‌ న్యూస్‌ అందించే వెబ్‌సైట్లను న్యూస్‌ వెబ్‌సైట్ల జాబితా నుంచి పూర్తిగా తొలగించనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు గూగుల్ "వెబ్‌సైట్‌లు, గూగుల్‌ న్యూస్‌తో పాటు ఎవరిని తప్పుగా చూపించవద్దు. అలాగని మీకోసం మిమ్మల్ని మీరు తప్పుగా చూపించుకోవద్దు. తప్పులతో పాటు యజమాని వివరాలు గోప్యంగా ఉంచడం, నెటిజన్లను తప్పుదోవ పట్టించడం, ఒక దేశంలో ఉండి మరోక దేశంలో ఉన్నట్లు కంప్యూటర్‌ ఐపీలను సృష్టించడం వంటివి ఇక నుండి సహించం" అని వెల్లడించింది.