ఈవిఎ౦లను ట్యా౦పర్ చేయలేరు: ఈసీ

SMTV Desk 2017-12-18 12:13:35  evm, tampering, ec, hardhik patel, posibility, explanation

న్యూ డిల్లీ, డిసెంబర్ 18: ఎన్నికల్లో ఈవిఎం లను వినియోగించడంపై దేశ వ్యాప్త చర్చ జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ మళ్లీ బ్యాలెట్ పద్దతిని ప్రవేశపెట్టాలని ఈసిని కోరింది. తాజాగా పటీదార్ నేత హార్దిక్ పటేల్ గుజరాత్ ఎన్నికల్లో ఈవిఎ౦ల ట్యా౦పరింగ్ జరిగిందని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈవిఎ౦ లను ట్యా౦పర్ చేయలేరని తెలిపింది. దీనిపై అనేకసార్లు వివరణ ఇచ్చామని, అసత్య ఆరోపణలు చేసి పారదర్శకతను శంకి౦చవద్దు అంటూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎకే జ్యోతి హితవు పలికారు. ఆధునిక పరిజ్ఞానంతో త్వరితగతిన ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఎన్నికల సంఘం చూస్తుంటే, నిరాధారమైన ఆరోపణలు చేసి విశ్వసనీయతను, ప్రజల నమ్మకాన్ని ఓమ్ము చేయవద్దని పార్టీలకు ఈసీ సూచించింది.