విశాఖ హెలీ పర్యటనలో 180 మంది ఆకాశ విహారం...

SMTV Desk 2017-12-18 11:29:16  Heli tourism, visakapatnam, andhrapradesh

విశాఖపట్టణం, డిసెంబర్ 18: దేశంలో ఒక అద్భుత పర్యాటక ప్రాంతమైన విశాఖను, దాని అందాలను చూసే విధంగా ప్రభుత్వం హెలీ టూరిజంను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో నగర వాసులు ఎంతో ఉత్సాహంగా శని, ఆదివారాల్లో హెలీకాప్టర్‌ ఎక్కి ఆకాశ మార్గంలో విహరిస్తూ విశాఖ అందాలను ఆస్వాదించారు. ఈ రెండు రోజుల్లో సూమారు 180 మంది విహరించారు. ఈ హెలీ పర్యాటకాన్ని సందర్శకులకు అనుకూలంగా తీర్చిదిద్దడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై స్పష్టత కోసం శని, ఆదివారాల్లో పలు శాఖల ఉన్నతాధికారులకు ఆకాశ విహార అవకాశం కల్పించారు. ఈ నెల 23 లేదా 28వ తేది నుంచి పూర్తి హెలీకాప్టర్‌ పూర్తి సేవలు అందుబాటులోకి తేనున్నారు. ఆ తరువాత పవన్‌హాన్స్‌ సంస్థ అంతర్జాల చిరునామాలోనూ ఆన్‌లైన్‌లో టిక్కెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోనున్నారు.