జపాన్ తో పోరాడి ఓడిన పి.వి సింధు...

SMTV Desk 2017-12-17 18:30:17  PV Sindhu, lost the tournament, japan shutter, dubai.

దుబాయ్, డిసెంబర్ 17 : వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్ లో భారత్ కు మళ్ళీ చుక్కెదురైంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ లో పి.వి సింధు పోరాడి ఓడిపోయింది. ఫైనల్ లో ప్రారంభం నుండే దూకుడు చూపించిన సింధు.. పవర్ ఫుల్ షార్ట్స్, బేస్ లైన్ టెక్నిక్ తో జపాన్ షట్లర్ యమాగుచీని ఉక్కిరి బిక్కిరి చేసింది. మొదటి సెట్ లో 21-15 తేడాతో గెలిచి౦ది. రెండవ సెట్ లో ప్రత్యర్థి యమాగుచీ ఎదురు దాడికి దిగి 21-12 తో నెగ్గింది. ఇక కీలకమైన మూడో సెట్ హోరాహోరీగా కొనసాగింది. సుదీర్ఘమైన ర్యాలీలతో ఇరువురు పాయింట్ల కోస౦ పోరాడారు. కాని కీలక సమయంలో ఒత్తిడికి గురైన సింధు తడబడింది. దీనిని అదునుగా తీసుకున్న జపాన్ షట్లర్ యమాగుచీ చివరి సెట్ ను 21-19 స్కోర్ తేడాతో గెలుచుకుంది. దీంతో చరిత్ర సృష్టిస్తుంది అని ఎదురు చూసిన భారత్ కు నిరాశే మిగిలింది.