కిమ్ తండ్రి వర్ధంతి నేడు.. ఏం చేస్తాడో చూడు..?

SMTV Desk 2017-12-17 16:42:50  kim jong un, kim jong il, rockets,

ప్యాంగ్యాంగ్, డిసెంబర్ 17 : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వర్ధంతి నేడు. అయితే ఎప్పుడు క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న కిమ్, తన తండ్రి వర్ధంతి సందర్భంగా మరో క్షిపణి ప్రయోగం చేస్తాడో.. అని పలు దేశాల ఆందోళన చెందుతున్నాయి. ప్యాంగ్యాంగ్‌లోని మన్సు హిల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇల్‌ విగ్రహానికి అక్కడి ప్రజలు పూలమాలలతో నివాళులు అర్పించారు. అక్కడి వారు ఇల్‌ వర్థంతి కావడంతో ఈరోజు మద్యపానం ముట్టుకోకుండా, ఎలాంటి వినోదాత్మక ప్రదర్శనలు కూడా నిర్వహించుకోరట. కిమ్‌ ఇల్‌ 2011లో మరణించగా, అప్పటినుంచి ఆయన వర్థంతి, జయంతి లకు కిమ్‌ మిలిటరీ డ్రిల్స్‌, రాకెట్‌ ప్రయోగాలు నిర్వహిస్తుంటాడు.