మైసూరు రాజ కుటుంబంలో వంశాంకురం

SMTV Desk 2017-06-17 12:37:26  misur, vadayr 400years ,yodvir ,srirangaptanm

మైసూరు రాజ కుటుంబంలో వంశాంకురం బెంగళూరు, జూన్‌ 17: 400 సంవత్సరాల నిరీక్షణ అనంతరం మైసూరు మహారాజ వంశానికి శాప విముక్తి కలిగింది. సువిశాల రాజ్యం, అంగబలం, అర్ధబలం కలిగిన రాజవంశానికి లంకంత ప్యాలెస్‌ ఉన్నా 400 ఏళ్లుగా ఆ ఇంట చిన్నారుల చిందులు లేవు. ఓ జ్యోతిష్యుడు చెప్పినట్లే రాజవంశానికి ఇప్పటికి శాపవిముక్తి లభించబోతోంది. మైసూరు యువరాజు యదువీర త్వరలో తండ్రి కాబోతున్నారు. 400 ఏళ్ల క్రితం శ్రీరంగపట్నం మహారాజు శ్రీరంగాయన(తిరుమలరాజ) భార్య అలివేలమ్మ శాపం రాజవంశానికి తగిలిందని చెబుతారు. క్రీ.శ.1612లో శ్రీరంగాయన మైసూరు సింహాసనాన్ని ఏలుతున్న సమయమది. అప్పట్లో రాజు ఒడయార్‌ ఆయనపై తిరుగుబావుటా ఎగురవేసి తానే రాజయ్యాడు. ఈ నమ్మక ద్రోహానికి ఖంగుతిని తీవ్ర ఆవేదనకు గురైన తిరుమలరాజ భార్య అలివేలమ్మ కొన్ని ఆభరణాలు తీసుకుని తలకాడుకు వెళ్లిపోయింది అలివేలమ్మ మైసూరు రాజవంశం నిలవదని.. ఆ ఇంట సంతాన భాగ్యం ఉండదని శపించి కావేరీ నదిలోకి దూకిందని చరిత్ర చెబుతోంది. ఆమె శాపం ఫలితమో లేక మరేదైనా కారణమోగానీ అప్పటి నుంచి ఇప్పటివరకు మైసూరు రాజులంతా సంతానయోగం లేక మనోవేదనకు గురైనవారే. గత్యంతరం లేక బంధువులలో యోగ్యుడైన ఒక పిల్లవాడిని ఎంపిక చేసుకుని దత్తత తీసుకుని రాజవంశ వారసుడిగా ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేసి మైసూరు మహారాజుగా ప్రకటిస్తూ వచ్చారు. జ్యోతిష్యులు చెప్పినట్లే ఆమె ఇప్పుడు 5 నెలల గర్భిణిగా ఉంది. దీంతో రాజవంశంలో ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా ఉన్నాయి. బుల్లియువరాజును ఆహ్వానించేలా ఈసారి దసరా ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించాలని రాజమాత అప్పుడే నిర్ణయించినట్లు సమాచారం.