ఇకపై రైలు టికెట్లపై డిస్కౌంట్‌..!

SMTV Desk 2017-12-17 14:49:09  TRAIN TICKETS, DISCOUNT OFFER, RAILWAY MINISTER PIYUSH GOSHAL.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17 : ఇకపై రైలు టికెట్లపై కూడా డిస్కౌంట్‌ ను ప్రకటించనున్నారు. ఎయిర్‌లైన్స్‌ తరహాలో ఈ మేరకు రైల్వే శాఖ ఈ అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. అలాగే ప్రధానంగా ప్రయాణికుల భద్రతపైనే దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రైళ్లలో సీసీటీవీలు ఏర్పాటు చేసి, వైఫై సదుపాయాన్ని కల్పించనున్నామన్నారు. ఈ సందర్భంగా పీయూష్‌ మాట్లాడుతూ.. "ఎయిర్‌లైన్స్‌ తరహాలో రైల్వే టికెట్లపై రాయితీ ఇచ్చే అంశంపై అధ్యయనం చేస్తున్నాం. టికెట్స్ చివరి నిమిషంలో పలు విమానాలు, హోటళ్లలో డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఇదే తరహాలో తక్కువ ఆక్యుపెన్సీ కలిగిన మార్గాల్లో డిస్కౌంట్లు అందిస్తాం" అంటూ పేర్కొన్నారు.