ఇజ్రాయెల్‌తో సేల్ఫీ దిగితే ఇక అంతే...

SMTV Desk 2017-12-17 13:14:37  miss IRAQ sara idan, miss israel, iraq,

ఇజ్రాయెల్, డిసెంబర్ 17: అక్కడ వేరే దేశం అమ్మాయితో ఫోటో దిగితే ఆ ప్రాంతం నుండి పంపించేస్తారు. విషయం ఏంటంటే... 2017లో మిస్‌ ఇరాక్‌గా కిరీటం దక్కించుకున్న సారా ఇదాన్‌ అనే యువతి మిస్‌ ఇజ్రాయెల్‌గా ఎంపికైన అదర్‌ గాండెల్స్‌మ్యాన్‌తో సెల్ఫీ దిగింది. ఈ ఫొటోని సారా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడంతో వివాదాస్పదంగా మారి బెదిరింపులు వచ్చాయి. దాంతో సారా కుటుంబం అమెరికాకు వలసపోయింది. ఈ సందర్బంగా సారా మీడియాతో మాట్లాడుతూ... " మిస్‌ ఇజ్రాయెల్‌తో కలిసి దిగిన ఫొటోలు తొలగించాలని, వెంటనే ఇరాక్‌కి తిరిగిరావాలని, లేదంటే టైటిల్‌ను వెనక్కి తీసుకునేలా చేస్తామని బెదిరించారు. ఇరాక్‌, ఇజ్రాయెల్‌ దేశాలు స్నేహపూర్వకంగా మెలగాలని భావించి ఈ ఫొటో పోస్ట్‌ చేశాను. అంతేకాని వేరే ఉద్దేశం లేదు. ఇరాక్‌లో చాలా మంది అమ్మాయిలు భయంతో బతుకుతున్నారని" చెప్పారు.