ఇక ఐపీఎల్ లో డీఆర్‌ఎస్‌ రానుందా..?

SMTV Desk 2017-12-17 12:54:44  BCCI, DRS, IPL MATCH, ICC Umpires coach, Ausys former cricketer Denis Barnes, WORK SHOP IN VIZAG

వైజాగ్, డిసెంబర్ 17 : బీసీసీఐ.. అంపైర్‌ నిర్ణయ సమీక్ష విధానానికి (డీఆర్‌ఎస్‌) మొదట చాలా వ్యతిరేకత చూపించింది. అనంతరం సానుకూలంగా స్పందిస్తూ అంతర్జాతీయ మ్యాచ్ లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. కాగా ఇప్పుడు ఈ డీఆర్‌ఎస్ పద్దతిని క్రికెట్ లో మెగా లీగ్ గా పేరొందిన ఐపీఎల్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు డీఆర్‌ఎస్ వినియోగంపై ఐసీసీ అంపైర్ల కోచ్‌, ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ డెనిస్‌ బర్న్స్‌, అంపైర్‌ పాల్‌ రీఫిల్‌ నేతృత్వంలో 10 మంది భారత అగ్రశ్రేణి అంపైర్లకు బీసీసీఐ వర్క్‌షాప్‌ నిర్వహించింది. దీనిపై బీసీసీఐ ఇప్పటి వరకు అధికారిక నిర్ణయం తీసుకోలేదు కాని త్వరలో డీఆర్‌ఎస్‌పై ఒక స్పష్టతను ఇవ్వనున్నట్లు బోర్డు అధికారి తెలిపారు.