యూపీలో మాజీ ఎమ్మెల్యే కుమారుడి దారుణ హత్య!

SMTV Desk 2017-12-17 12:11:15  murder, vaibhav tiwary, uttarpradesh, son, premprakash tiwary

లక్నో, డిసెంబర్ 17: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో శనివారం రాత్రి దారుణ హత్య జరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ ప్రకాశ్ తివారీ కుమారుడు వైభవ్ తివారీ(36)ని ఓ గుర్తుతెలియని వ్యక్తి తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన అసెంబ్లీకి సమీపంలోని కస్మాండా హౌస్‌లో జరిగింది. పోలీసుల కథనం మేరకు... వైభవ్ తివారీ ఐఐఎం అహ్మదాబాద్‌ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందాక సూరజ్ అనే పార్ట్‌నర్‌తో కలిసి కొన్నేళ్లపాటు బిజినెస్ చేసిన అనంతరం వీరిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. దీంతో వీరు వేర్వేరుగా వ్యాపారాలు నిర్వహిస్తు౦డగా సూరజ్ మాత్రం వైభవ్‌పై గత కొంతకాలం నుంచి పగతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి యూపీ అసెంబ్లీ సమీపంలోని వైభవ్ నివాసం కస్మాండా హౌస్‌కు గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తన వెంట తెచ్చుకున్న తుపాకీతో వైభవ్‌పై కాల్పులకు తెగబడి అతడిని హత్యచేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు లక్నో జోన్ ఏడీజీ అభయ్ ప్రసాద్ వివరించారు. గిప్పీ తివారీకి ఏకైక సంతానం వైభవ్ తివారీ. కాగా, గిప్పీ తివారీ 1989, 1991, 1993లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దొమారియాగంజ్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. గిప్పీ తివారీకి ఏకైక సంతానం, వైభవ్ ది ప్రేమ వివాహం కావడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ హత్యను సూరజ్ చేయించారని గిప్పీ తివారీ ఆరోపించారు.