అలాంటి వారిని చంపేయాలి : వాజుభాయ్‌వాలా

SMTV Desk 2017-12-17 11:54:46  karnataka, governor, Vajubhai Vala, kasab, terrorist

కర్ణాటక, డిసెంబర్ 17 : కర్ణాటక గవర్నర్ వాజుభాయ్‌వాలా ఉగ్రవాదులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. "ప్రజల ప్రాణాలను అన్యాయంగా పొట్టన పెట్టుకొనే ఉగ్రవాదులను ఉరితీసేందుకు అంతకాలం అవసరమా...? అలాంటి దేశ ద్రోహులను మూడు రోజుల్లోనే ఉరితీయాలి. ముంబై మారణ కాండలో సజీవంగా పట్టుబడి ఉరిశిక్షకు గురైన ఉగ్రవాది కసబ్‌కు వర్ధంతి జరిపే వారిని తుపాకీతో కాల్చి చంపాలి. దేశద్రోహులు, ఉగ్రవాదుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. సమాజంలో అల్లర్లు సృష్టించే ఉగ్రవాదులకు క్షమాభిక్ష అవసరం లేదు" అంటూ వ్యాఖ్యానించారు.