మందు తో విద్యార్థుల దాహం తీర్చిన ఉపాధ్యాయులు...

SMTV Desk 2017-12-17 11:27:46  student drunk, teacher give alcohol to students.

బెంగళూరు, డిసెంబర్ 17: గురుబ్రహ్మ: గురువిష్ణు:.. గురుదేవో: మహేశ్వర... అంటూ దైవ సమానంగా భావించే ఉపాధ్యాయుల స్థానానికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించారు. దాహం వేస్తుందని నీళ్ళు అడిగితే మద్యం తాగించి మత్తులోకి పంపారు. ఈ ఘటన కర్నాటకలోని తుమూకురు జిల్లాలో ఈ నెల 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు పాఠశాల తరుపున విహారయాత్రకు విద్యార్థులతో వెళ్లి, తిరిగి వస్తున్నా సమయంలో విద్యార్థులకు దాహం వేసి మాకు నీళ్ళు కావాలని ఉపాధ్యాయులకు అడిగారు. అప్పటికే మద్యం మత్తులో చిత్తుగా ఊగుతున్న గురువులు, మద్యం కలిపిన నీళ్ళను విద్యార్థులకు అందించారు. అది తగిన విద్యార్థుల్లో కొందరు అస్వస్థకు గురి కాగా, మరి కొందరు తూగుతూ ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు స్కూల్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కమిటీకి ఫిర్యాదు చేశారు. పై అధికారులు దీనికి బాధ్యులైన ప్రధానోపాధ్యాయుడు సహా మరో ఇద్దరు ఉపాధ్యాయులను విధుల నుండి బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.