బుల్లితెర రాక్ స్టార్ గా ప్రదీప్....

SMTV Desk 2017-12-17 11:12:50   Anchor pradeep Television rock star, hyderabad

హైదరాబాద్, డిసెంబర్ 17 : ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, పంచ్ లు వేయాలన్నా... వేయించుకోవాలన్నా... ప్రస్తుత యాంకర్లలో ఒక్కడైన ప్రదీప్ బుల్లితెర రాక్ స్టార్ పేరును సొంతం చేసుకున్నాడు. ఎఫ్ఎం రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించిన ప్రదీప్, తన ప్రతిభను కనబరచడంతో, టీవీ షో యాంకర్ అయ్యాడు. అంతేకాకుండా నవరసాలు కనపరుస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. సినిమాల్లో ప్రముఖులతో కలిసి తనదైన శైలిలో అలరిస్తున్నాడు. ఇక ప్రదీప్ యాంకరింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి షో లో తన మాట తీరు, ఆహార్యం మార్చుకొని...బెస్ట్ యాంకర్ అనిపించుకున్నాడు. కొంచెం టచ్ లో ఉంటే చెపుతా...డీ షో వ్యాఖ్యాతగా...గణపతి బప్పా మోరియా, ఇలా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాల్లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్న ప్రదీప్...బుల్లితెర రాక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.