ప్రధాని మోదీపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు...

SMTV Desk 2017-12-16 18:32:04  Rahul Gandhi Comments On Modi, congress, bjp partys.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16 : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ రాజకీయాలను ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం వాడడం లేదని, ప్రజలను అణగదొక్కే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 21వ శతాబ్ధం వైపు తీసుకెళ్తే.. ప్రధాని మోదీ మాత్రం దేశాన్ని మళ్లీ మధ్యయుగంలోకి తీసుకువెళ్తున్నారని విమర్శించారు. ఒకసారి మంటలు వ్యాపిస్తే వాటిని ఆర్పడం సులువు కాదు. బీజేపీ దేశంలో హింసను సృష్టించి౦ది. ఇప్పుడు ఆ హింస దేశ వ్యాప్తంగా ప్రజ్వరిల్లుతున్నదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్వేషపూరితమైన రాజకీయాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని, కాని బీజేపీ వారిని ఒక సోదర సోదరీమణులుగానే భావిస్తామని పేర్కొన్నారు.