గుజరాత్ ఎన్నికల్లో ఆరు చోట్ల రీపోలింగ్...

SMTV Desk 2017-12-16 17:54:30  gujarath elections, re polling, maak polling, evm.

అహ్మదాబాద్, డిసెంబర్ 16 : గుజరాత్‌లోని ఆరు పోలింగ్ బూత్ లలో తిరిగి ఎన్నికల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఇటీవల నిర్వహించిన పోలింగ్ లో మాక్ పోల్ నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారులు ఆ ఈవీఎంల నుంచి మాక్‌పోల్ ఓట్లను తొలగించకపోవడంతో ఈసీ రీపోలింగ్‌కు నిర్ణయించింది. కాగా వాద్గాం, వీరంగామ్, దస్కొరాయ్, సావ్లి ఏరియాల్లో ఈ పోలింగ్ బూత్‌లున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను 18వ తేదీన ప్రకటించనున్నారు.