పనామా పేపర్ల లీక్‌పై సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు...

SMTV Desk 2017-12-16 17:33:53  subramanian yaswamy, panama paper leak, bjp,

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఎప్పుడు వివాద స్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ సినీయర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా... " పనామా పేపర్లలో ప్రముఖ టాటా సన్స్‌ డైరెక్టర్లలో చాలా మంది ఉన్నారు. నాకు సమయమిస్తే, అందరి వివరాలను ఆధారాలతో సహా బయట పెడతాను." అంటూ ట్విట్ చేశారు. ఇప్పుడు సర్వత్రా ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలైన పనామా పేపర్ల లీక్‌, విదేశాల్లో నల్లధనం దాచుకున్న నల్ల కుబేరుల జాబితాను ఈ పేపర్లు బయటపెట్టిన సంగతి తెలిసిందే.