‘కృష్ణ.. కృష్ణ...’ అంటేనే ఆపరేషన్...

SMTV Desk 2017-12-16 16:17:04  Krishna Krishna is the doctor who made the operation

బెంగళూరు, డిసెంబర్ 16 : కృష్ణ..కృష్ణ.. అంటేనే ఆపరేషన్ చేస్తానని ఓ వైద్యుడు ఆసుపత్రికి వచ్చిన ముస్లిం మహిళను ఇబ్బంది పెట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... యశ్వంత్ పూర్ లోని నందిని లేఅవుట్ కు చెందిన నసీమాభాను కు ఇద్దరు పిల్లలు. అయితే కు.ని (కుటుంబ నియంత్రణ)ఆపరేషన్ చేయించుకోవడం కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన ఆమెను, కొంత సమయం తరువాత ఆపరేషన్ గదిలోకి డాక్టర్ రామకృష్ణ పిలిచాడు. లోపలికి వెళ్ళాక, తనను ‘కృష్ణ..కృష్ణ..” అంటేనే శత్రచికిత్స చేస్తానని చెప్పడంతో నసీమా వాపోయింది. నేను ముస్లిం మహిళను... ఎలా అనగలను... అంటున్నా వినిపించుకోకుండా మళ్లీ అదే పాట పాడాడు వైద్యుడు. చేసేదేం లేక..నసీమా “కృష్ణ..కృష్ణ..” అన్నాకే వైద్యం చేసాడు. బయటికి వచ్చిన తరువాత తన మతపరమైన మనోభావాలకు భంగం వాట్టిల్లేవిధంగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.