జీఎస్‌టీ కిందికి బిట్‌కాయిన్‌...

SMTV Desk 2017-12-16 14:16:00  bitcoin, gst, virtual currency, it department, rbi,

న్యూఢిల్లీ, డిసెంబర్ 16 : ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న వర్చువల్‌ కరెన్సీ బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీలపై పరోక్ష పన్నుల శాఖ అధికారులు సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బిట్‌కాయిన్‌ను వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆదాయ పన్నుల శాఖ అధికారులు బుధవారం బిట్‌కాయిన్‌ ఎక్స్ఛేంజీలైన జెబ్‌పే, యునోకాయిన్‌, కాయిన్‌ సెక్యూర్‌ సంస్థల్లో ఆదాయ పన్ను చట్టం 133ఏ ప్రకారం సర్వే నిర్వహించారు. ఈ చట్ట౦ ఉద్దేశం ఏంటంటే... ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు పొందిన వారు పన్నులు ఎగవేస్తున్నారా? అనే అంశంపై మదుపర్లు, ట్రేడర్లు వారు జరిపిన లావాదేవీలు, అవతలి పక్షం వాళ్ల గుర్తింపు, సంబంధిత బ్యాంకు ఖాతాలను తెలుసుకుని సాక్ష్యాలను సేకరిస్తారు. ఈ బిట్‌కాయిన్‌ పరోక్ష పన్నుల కిందకు రాదు కాబట్టి జీఎస్‌టీ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది.