అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతల స్వీకరణ

SMTV Desk 2017-12-16 12:04:10  Congress Party President, Rahul Gandhi, appointed, sonia gandhi.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16 : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలను స్వీకరించారు. వరుసగా నెహ్రూ కుటుంబం నుంచి ఆరోసారి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపట్టిన వ్యక్తిగా రాహుల్‌ నిలిచారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ప్రధాన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ పదవి బాధ్యతలను స్వీకరించి, అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తన బాధ్యతలను నిర్వర్తించిన సోనియా గాంధీ ఆ పదవి బాధ్యతల నుండి తప్పుకొన్నారు. రాహుల్ పట్టాభిషేకానికి ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దీంతో ఆ ప్రాంగణమంతా రాహుల్ నినాదాలతో హోరెత్తింది. కార్యకర్తలు టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.