విరుష్క జంటను దిష్టి కళ్ల నుంచి కాపాడాలి: ఆమిర్‌

SMTV Desk 2017-12-16 11:07:55   Mohammed Aamir, virat kohli, anushka sharma,

హైదరాబాద్, డిసెంబర్ 16: వివాహంతో ఏకమైన కోహ్లీ-అనుష్కల ప్రేమ జంటకు అటు క్రికెట్ ఇటు బాలీవుడ్ వర్గాల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అంతేకాదు పాకిస్థాన్‌ క్రికెటర్ల నుంచీ కూడా విరుష్క జంటకు అభినందనల వెల్లువ కురిసింది. ఈ నేపథ్యంలో పాక్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ తెలియజేసిన శుభాకాంక్షలు మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. ఆమిర్‌ తన ట్విట్టర్ వేదికగా..." నాకు చాలా సంతోషంగా ఉంది. క్రికెట్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నట్టే నూతన జీవితంలో విజయవంతం అవ్వాలని, వారిద్దరూ ఆనందంగా సుఖమయ జీవితం గడపాలని అల్లాను ప్రార్థిస్తున్నా. దిష్టి కళ్ల నుంచి వారిని కాపాడాలని కోరుకుంటున్నా. చాలా మంది దృష్టి వారిమీద ఉన్నట్టే దిష్టికళ్లూ వారిపై ఉంటాయి." అంటూ ట్విట్ చేశాడు.