నేడు రాహుల్ గాంధీ పట్టాభిషేకం...

SMTV Desk 2017-12-16 10:37:12  rahul gandhi, become congress president, Rahul Gandhis Coronation

న్యూఢిల్లీ, డిసెంబర్ 16 : నేడు యువరాజు రాహుల్ గాంధీ పట్టాభిషేకం జరగనుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఈ ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం అధ్యక్షుడు ఎం.రామచంద్రన్‌, సోనియాగాంధీ చేతుల మీదుగా అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడంతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధృవపత్రాన్ని అందుకోనున్నారు. ఇందు నిమిత్తం భారీ ఏర్పాట్లను చేశారు. డప్పులతో నృత్యాలను ప్రదర్శిస్తూ ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఆ పార్టీ కార్యాలయ ప్రాంగణమంతా రాహుల్ గాంధీ చిత్రపటాలతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి సీనియర్ కార్యకర్తలు, నాయకులు హాజరుకానున్నారు.