దివాకర్ రెడ్డి విషయాన్ని చట్టానికి వదిలేస్తాం: అశోక్ గజపతిరాజు

SMTV Desk 2017-06-16 19:26:38  Vishakapatnam Airport,Indigo Airlines,J.C.DiwakarReddy,

విశాఖపట్నం, జూన్ 16 : విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దీంతో, జేసీపై ఏడు ఎయిర్ లైన్స్ కంపెనీలు నిషేధం విధించాయి. ఎయిర్ పోర్టుకు గంట ముందే వచ్చానని దివాకర్ రెడ్డి చెప్పారని... కానీ, సీసీటీవీ ఫుటేజీలో అది అవాస్తవమని తేలిందని అశోక్ గజపతిరాజు వెల్లడించారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. మరోవైపు, చిన్న చిన్న విషయాలు కూడా పార్టీ పరువును దిగజారుస్తుండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.