ప్రపంచంలో అతిపెద్ద నూడిల్.. దీని పొడువెంతో తెలుసా..?

SMTV Desk 2017-12-15 19:01:27  longest noodle, Guinness record,

బీజింగ్, డిసెంబర్ 15: నూడిల్స్ అంటే మనకు మొదటగా గుర్తొచ్చేది చైనా. ఎందుకంటే దీని జన్మస్థలం అక్కడే కాబట్టి. అయితే 2007లో జపాన్ 1800 అడుగుల పొడువు గల నూడిల్ చేసి గిన్నిస్ బుక్కులో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమిస్తూ చైనా 10119 అడుగుల పొడువుగల నూడిల్ ను తయారు చేసి గిన్నిస్ రికార్డ్ బద్దలు కొట్టింది. సీనియర్స్‌ డే సందర్భంగా చైనాకు చెందిన ఓ సంస్థ ఈ నూడిల్ ను తయారు చేసింది. దీని తయారీ కోసం 40 కిలోల రొట్టెపిండి, 26.8 లీటర్ల నీళ్లు, 0.6 కిలోల ఉప్పును వినియోగించి, 17 గంటల పాటు నిరంతరం తయారీకి కృషి చేసినట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. దాదాపు 66 కిలోల బరువు ఉన్న ఈ నూడిల్ ను 400 మంది ఉద్యోగులు అతిధులకు వడ్డించారు.