ప్రభుత్వ అనుమతులతో చెన్నంపల్లి కోట తవ్వకాలు షురు

SMTV Desk 2017-12-15 15:56:24  ap gold, demainds digging,

కర్నూలు, డిసెంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో పూర్వపు వజ్రాలు, బంగారు నిక్షేపాల అన్వేషణలో భాగంగా తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చెన్నంపల్లి గ్రామ కమిటీ, పోలీసుల సమక్షంలో ఈ తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో ఎయిర్ పైపులైన్‌ ద్వారా కోటలోని బండరాళ్లను రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు తొలగిస్తున్నారు. త్వరలో ఈ పనులను పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.