పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తేవద్దు : ఈటల

SMTV Desk 2017-12-15 14:42:37  Petroleum products, GST, financial minister eetela Rajendar,

న్యూఢిల్లీ, డిసెంబర్ 15 : పశ్చిమబెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిత్రా అధ్యక్షతన జీఎస్టీ సాధికార సంఘం(ఎంపవర్‌ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ పాల్గొని మాట్లాడారు. "పెట్రోలియం ఉత్పత్తులను, రిజిస్ట్రేషన్లను ఇప్పుడిప్పుడే జీఎస్టీ పరిధిలోకి తేవద్దు" అంటూ పేర్కొన్నారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రాల ఆదాయానికి నష్టం వాటిల్లే విధంగా ఉండే చర్యలకు వ్యతిరేకమన్నారు. కాగా, తొలిసారి.. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు సభ్యులుగా ఈ భేటీ జరగడం విశేషం.