టీడీపీ, బీజేపీ వర్గీయుల మధ్య ఘర్షణ

SMTV Desk 2017-12-15 13:18:05  TDP, BJP PARTYS, DISPUTE, FUNDS ISSUE, KARNOOL NEWS.

కర్నూలు, డిసెంబర్ 15 : టీడీపీ, బీజేపీ వర్గీయుల మధ్య నిధుల విషయమై గొడవ తలెత్తింది. ఆ గొడవ కాస్త ముదిరి చివరికి చంపుకునే వరకు వచ్చిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఐటీడీఏ నిధుల విషయమై టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో గొడవ కాస్తంత పెద్దదిగా మారి చివరికి టీడీపీ నాయకుడు పుల్లారెడ్డిపై, బీజేపీ నాయకుడు సుబ్బరాయుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పుల్లారెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం సుబ్బరాయుడు తప్పును ఒప్పుకొని పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.