రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సోనియాగాంధీ..!

SMTV Desk 2017-12-15 12:44:33  soniya gandhi, retairment, congres, president, rahul, aicc

న్యూఢిల్లీ, డిసెంబర్ 15 : గాంధీ కుటుంబం నుంచి సుదీర్ఘకాలం కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన సోనియాగాంధీ రాజకీయాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఆమె సుమారు 19 సంవత్సరాలు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి కేంద్రంలో రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. నేడు మొదలైన పార్లమెంట్ సమావేశాల వాయిదా అనంతరం, పార్లమెంట్ ఆవరణలో ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. వయస్సు, ఆరోగ్యం రిత్యా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తాను నిర్వర్తించిన బాధ్యతల పట్ల సంతోషంగా ఉన్నానని, సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాహుల్.. గాంధీ కుటుంబంలో కాంగ్రెస్ ఆరవ అధ్యక్షుడు కావడం విశేషం. రెండుసార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ తృణప్రాయంగా వదిలేసిన త్యాగమూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలు సోనియాగాంధీ గురించి చెప్పుకుంటారు.